సంక్రాంతికే ఫిక్స్ అయిన ‘నాన్నకు ప్రేమతో’!

nana-prematho

యంగ్ టైగర్ ఎన్టీఆర్, విలక్షణ దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలుస్తుందంటూ ప్రచారం పొందుతూ వస్తోంది. ఇక సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ పకడ్బందీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా లండన్, స్పెయిన్‌లలోని అద్భుతమైన లొకేషన్స్‌తో మ్యాజిక్ చేయనుంది.

ఇక ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న సినిమా యూనిట్ ఈ నెలాఖర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, సంక్రాంతికల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సాయంత్రం నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకులకు ముందుకు తెచ్చేలా ప్లాన్ చేసిన యూనిట్ అందుకు తగ్గట్టుగానే ప్రొడక్షన్ స్పీడ్ పెంచింది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

Exit mobile version