
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఇటీవలే హైదరబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం డిసెంబర్ 1 నుంచి స్పెయిన్ షెడ్యూల్ ని మొదలు పెట్టింది. అక్కడ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ చిత్ర టీం షూటింగ్ ని ఫినిష్ చేస్తోంది. దాదాపు 20వ తేదీ వరకూ అక్కడే షూటింగ్ జరగనున్న షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80% షూటింగ్ ని పూర్తి చేసింది.
మరోవైపు ఈ చిత్ర టీం ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నాం అని అనౌన్స్ చేసింది. రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో అన్ని రకాల పనులను వేగవంతం చేసింది ఈ చిత్ర టీం. షూటింగ్ జరుగుతున్నప్పటికీ మిగతా ఫినిష్ అయిన పార్ట్ కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్, డిఐ మరియు రీ రికార్డింగ్ పనులను దాదాపు పూర్తి చేసారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లో షూట్ చేసిన పార్ట్ కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అనుకున్న దాని ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం కంటిన్యూగా వర్క్ చేస్తోంది.
ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎక్కువ భాగం అబ్రాడ్ లోనే జరగనున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుంటే, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.