
‘నాన్నకు ప్రేమతో’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, విలక్షణ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తోన్న స్టైలిష్ రివెంజ్ డ్రామా. ఇప్పటివరకూ అంతటా విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చిన ఈ సినిమా తాజాగా టీజర్ రిలీజ్ దగ్గర్నుంచి సంచలనంగా మారిపోయింది. దసరా కానుకగా నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి ఓ 30 సెకండ్ల నిడివి గల టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతోంది.
విడుదలైన ఐదు రోజుల్లో 17 లక్షల వ్యూస్‌తో పాటు 35,000కు పైగా లైక్స్ సాధించి నాన్నకు ప్రేమతో టీజర్ యూట్యూబ్‌లో సంచలనం రేపుతోంది. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో ఒక ట్రైలర్/టీజర్‌కు సంబంధించి నాన్నకు ప్రేమతో టీజర్‌కు వచ్చినన్ని లైక్స్ వేరే ఏ ఇతర టీజర్‌కు రాలేదు. ఇక తమ అభిమాన హీరో టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోన్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు సినిమాపై అంచనాలను మరింత పెంచేసుకుంటున్నారు.
ఇక ఈ టీజర్లో ఎన్టీఆర్, గతంలో ఏ సినిమాలోనూ కనిపించనంత స్టైలిష్‌గా, సరికొత్త లుక్‌తో విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. సుకుమార్ మార్క్ స్టైలిష్ మేకింగ్ ఈ టీజర్లో స్పష్టంగా కనబడుతోంది. ఎన్టీఆర్ లుక్, చిన్న చిన్న స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌కు అభిమానుల దగ్గర్నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి నెలలో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.