ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఆకట్టుకుంటున్న నారా రోహిత్ 20 అనౌన్స్ మెంట్ గ్లింప్స్

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఆకట్టుకుంటున్న నారా రోహిత్ 20 అనౌన్స్ మెంట్ గ్లింప్స్

Published on Apr 17, 2024 6:04 PM IST

ప్రస్తుతం ప్రతినిధి 2 మూవీ చేస్తున్నారు నారా రోహిత్. ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక నేడు శ్రీరామ నవమి సందర్భంగా తన నెక్స్ట్ మూవీ అయిన కెరీర్ 20వ మూవీని అనౌన్స్ చేసారు నారా రోహిత్. ఈ లవ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి సుందరకాండ అనే టైటిల్ ఫిక్స్ చేసి కొద్దిసేపటి క్రితం టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.

ఏ రెండు కథలు ఒకేలా ఉండవు, ఏ ఇద్దరు ఒకేలా ప్రేమించలేరు అంటూ పలు సక్సెస్ఫుల్ సినిమాల్లోని ప్రేమ కథలను హీరో రోహిత్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇస్తూ రూపొందిన ఈ టైటిల్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక చేతిలో పూల కుండి, మరొక చేతిలో పుస్తకం పట్టుకుని ఉన్న నారా రోహిత్ లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తంగా సుందరకాండ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

ఇక ఈ మూవీని వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తుండగా సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి గ్రాండ్ లెవెల్లో దీనిని నిర్మిస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 6న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇందులో వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు