
నారా రోహిత్ గత సంవత్సరం ఓ డిఫరెంట్ పోలీస్ డ్రామా ‘రౌడీ ఫెలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నారా రోహిత్ కి ఓ డిఫరెంట్ ఇమేజ్ ని ఇచ్చింది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం నారా రోహిత్ త్వరలోనే మరో పోలీస్ డ్రామా సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ ఓ జైలర్ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో నారా రోహిత్ పాత్ర 4 దశాబ్దాల క్రితం సీనియర్ ఎన్.టి.ఆర్ చేసిన ఓ జైలర్ పాత్రని పోలి ఉంటుంది.
ఇదొక ప్రయోగాత్మక సినిమా. ఈ సినిమాలో నారా రోహిత్ స్లిమ్ అండ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే నారా రోహిత్ తన లుక్ పై వర్కౌట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు, నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. నారా రోహిత్ తదుపరి సినిమా సావిత్రి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

