వెంకి సినిమా నుండి నారా రోహిత్ లుక్ విడుదల !

తేజ సినిమాలో వెంకటేష్ తో పాటు నారా రోహిత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వెంకి బావమరిది పాత్రలో నారా రోహిత్ నటించబోతున్నాడు. మొదట ఈ పాత్ర కోసం వేరే హీరోలను అనుకున్నా చివరికి నారా రోహిత్ చేస్తే బాగుంటుందని భావించిన దర్శకుడు తేజ నారా రోహిత్ ను సంప్రదించడం సబ్జెక్టు చెప్పడం వెంట వెంటనే జరిగిపోయాయి.

మార్చి రెండో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ లో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కథానాయికగా ఇషా రెబ్బ నటించే అవకాశాలు ఉన్నాయి. ఉదయం వెంకటేష్ లుక్ బయటికి వచ్చింది. సాఫ్ట్ లుక్ లో వెంకటేష్ ఫాన్స్ ఫిదా చేసాడు. అదే తరహాలో నారా రోహిత్ బయటికి రావడం జరిగింది. కూల్ లుక్ లో కనిపిస్తోన్న నారా రోహిత్ లుక్ ఆకట్టుకుంటుంది.

Exit mobile version