రేపు ప్రకటించనున్న నారా రోహిత్ కొత్త సినిమా వివరాలు !
Published on Mar 13, 2018 11:02 pm IST

నారా రోహిత్ ప్రస్తుతం పరుచూరి మురళి దర్శకత్వంలో ఆటగాళ్ళు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. జగపతిబాబు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి కార్తీక్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత నారా రోహిత్ చెయ్యబోయే తరువాతి సినిమాకు సంభందించి ఒక అధికారిక ప్రకటన రేపు ఉదయం ప్రకటించబోతున్నారు.

నారా రోహిత్ తేజ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. తేజ సినిమాలో నారా రోహిత్ చెయ్యబోయే పాత్ర డిఫరెంట్ గా ఉండబోతోందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ తో పాటు నారా రోహిత్ కొత్త దర్శకుడితో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

 
Like us on Facebook