భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతి విషయలంలోనూ అధికారులను పరుగులెత్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలతో ప్రజలకు అండదండగా నిలుస్తున్న నరేంద్ర మోడీ తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై ధ్వజమెత్తారు. గౌహతిలో జరిగిన ఓ కాన్ఫిరెన్స్ లో మోడీ పోలీస్ శాఖ వారి రెస్పాన్సిబిలిటీని, పోలీస్ సిస్టంని సినిమాల్లో సరిగా చూపించాలని కోరారు.
‘మన సినిమాల్లో రియాలిటీ పేరు చెప్పి పోలీస్ సిస్టం మరియు పోలీస్ అధికారులను చాలా నెగటివ్ షేడ్స్ లో చూపిస్తారు. చాలా సినిమాలో పోలీసులే విలన్స్ గా కనిపిస్తారు. కొంతమంది హీరోలేమో తమ హీరోయిజం కోసం బాగా పొగరుగా బిహేవ్ చేసే పోలీసులుగా కనిపిస్తారు.అర్థ్ సత్య, కర్తవ్యం, ఈనాడు లాంటి సినిమాల్లో సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో చూపించారు. చాలా సినిమాల్లో పోలీసులే క్రైమ్ మరియు లంచగొండి తనానికి ప్రతీక అని చూపించడం బాలేదు. అందుకే మీడియా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను ఓ విషయం చెప్పనున్నాను. పోలీస్ సిస్టంలో ఉన్న నెగటివ్స్ కంటే పాజిటివ్స్ ని ప్రమోట్ చెయ్యండి. నెగటివ్ ని తక్కువగా చూపించాలని’ అన్నాడు. మరి మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోడీ చెప్పిన ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటుంది అనేది చూడాలి.


