సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం (నవంబర్ 6) నుండి ప్రారంభమైంది. గత ఆగస్ట్ నెలలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో నవీన్ మరియు ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నవీన్ తండ్రి పాత్రలో నాగబాబు నటిస్తున్నారని సమాచారం.
ఈ సినిమాతో కృష్ణవంశి శిష్యుడు రామ్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై పార్ధ సారధి సమర్పణలో అడ్డాల చంటి నిర్మిస్తున్నారు. కథానుగుణంగా రెండు పాటలు, మరికొన్ని సన్నివేశాలను ఫారిన్ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.


