కన్నడ స్టార్ హీరో సినిమాకు మొదటి రోజు రికార్డు షోస్ !

Published on Feb 7, 2019 11:29 am IST

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘నటసార్వభామ’. ఈ చిత్రం ఈరోజు అక్కడ భారీ స్థాయిలో విడుదలైయింది. ఇక బెంగళూరు లో ఈచిత్రానికి మొదటి రోజు సుమారు 550 షోస్ పడనున్నాయి. ఇప్పటివరకు ఏచిత్రానికి కూడా అక్కడ ఇన్ని షోస్ పడలేదు. కాగా ఎర్లీ మార్నింగ్ షోస్ నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమా డీసెంట్ గా ఉందట.

మంచు మనోజ్ తో ‘పోటుగాడు’ సినిమా తెరకెక్కించిన పవన్ వడియార్ ఈచిత్రానికి దర్శకుడు. కాగా అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో ఒక కథానాయికగా నటించింది. కన్నడలో ఇదే ఆమెకు మొదటిచిత్రం. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :