కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టిన పవర్ స్టార్ !

Published on Feb 9, 2019 11:52 am IST

కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘నటసార్వభామ’ ఈనెల 7న భారీ స్థాయిలో విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. దానికి తోడు బెంగళూరు లో ఈచిత్రానికి మొదటి రోజు రికార్డు స్థాయిలో షోస్ పడడంతో ఈచిత్రం మొదటి రోజు కర్ణాటక లో 7.86 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది దాంతో ‘కెజియఫ్’ తరువాత హైయెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టిన రెండో కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ చిత్రం. ఇక పునీత్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ కూడా ఇదే కావడం విశేషం.

థ్రిల్లర్ నేపథ్యంలో పవన్ వడియార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రచిత రామ్ , అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించారు. కాగా అనుపమ కు కన్నడలో ఇదే మొదటిచిత్రం. ఇక పాజిటివ్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఈ చిత్రం అక్కడ మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :