ఈద్ సుఖసంతోషాలు నింపాలి – బాలయ్య

Published on May 25, 2020 1:22 pm IST

నందమూరి బాలకృష్ణ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలయ్య మాట్లాడుతూ.. ‘ముస్లిం సోదరులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్. మీరు లాక్ డౌన్ లో కూడా మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నాను. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి. సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని వేడుకుంటున్నా’ అని బాలయ్య తెలిపారు.

సమాజంలోని జాలి, కరుణ, సేవాతత్పరత, సుహృద్భావానికి ఈ పండగ ప్రతీక. కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూ సురక్షిత దూరాన్ని పాటిస్తూ ఈద్ జరుపుకోవాలి.

సంబంధిత సమాచారం :

More