నేషనల్ అవార్డ్ విన్నర్ “దాసి” సుదర్శన్‌ కన్నుమూత!

నేషనల్ అవార్డ్ విన్నర్ “దాసి” సుదర్శన్‌ కన్నుమూత!

Published on Apr 2, 2024 6:06 PM IST

తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో దాసి సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న దాసి సుదర్శన్‌ (73) మరణించారు. నల్గొండ జిల్లా, మిర్యాల గూడలోని తన స్వగృహంలో గుండెపోటు కి గురి అయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సుదర్శన్‌ వృత్తిరీత్యా నాగార్జున్‌ సాగర్‌ లోని హిల్‌ కాలనీ లోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా జర్నీని ప్రారంభించారు. జాతీయ అవార్డు జ్యూరిలోనూ సభ్యుడి గా పని చేశారు. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సోమవారం రాత్రి కన్ను మూశారు. సుదర్శన్‌ అంత్యక్రియలు ఇవాళ మిర్యాలగూడలో నిర్వహించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు