“విక్రమ్ 62” లోకి నేషనల్ అవార్డ్ విన్నర్!

“విక్రమ్ 62” లోకి నేషనల్ అవార్డ్ విన్నర్!

Published on Mar 3, 2024 8:40 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ హీరో నెక్స్ట్ తంగలాన్ మూవీ లో కనిపించనున్నారు. స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్ తన 62 వ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నా చిత్రం కి దర్శకత్వం వహించిన ఎస్. యూ. అరుణ్ కుమార్ ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు వెల్లడించారు.

ఈ చిత్రం లో నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన సూరజ్ వెంజరమూడు కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఎస్.జే. సూర్య ఈ చిత్రం లో మరొక కీలక పాత్రలో నటిస్తున్నారు. హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు