విషాదం: ఆ జాతీయ అవార్డు గ్రహీత ఇకలేరు !

విషాదం: ఆ జాతీయ అవార్డు గ్రహీత ఇకలేరు !

Published on Jun 7, 2026 10:01 AM IST

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మలయాళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన, బహుముఖ ప్రజ్ఞాశాలి, జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు, నటుడు సలీం కుమార్ (56) ఇకలేరు. శనివారం రాత్రి అకస్మాత్తుగా తలెత్తిన తీవ్ర అనారోగ్య సమస్య కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురై, నిన్న రాత్రి ఆయన కన్నుమూశారు. కేవలం 56 సంవత్సరాల వయసులోనే ఆయన ఇలా సడెన్ గా దూరం కావడం దురదృష్టకరం.

ఆయన అకాల మరణం, మలయాళ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సలీం కుమార్ తన అభిరుచిని చాటుకున్నారు. ఇక 2026 సంవత్సరంలో ఆయన నటించిన మరో ఆరు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మలయాళ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఇక మా 123తెలుగు.కామ్ తరఫున ‘సలీం కుమార్’ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు