
నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన బాలీవుడ్ హీరోయిన్స్ కి సౌత్ లో కూడా బాగా క్రేజ్ ఉంటుంది. కానీ వారు సౌత్ లో సినిమాలు చేయడానికి మాత్రం అంత త్వరగా ఇష్టపడరు. చాలా రేర్ గా అక్కడి స్టార్ హీరోయిన్స్ సౌత్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా అలాంటి అరుదైన సంఘటనని సౌత్ లోని కోలీవుడ్ లో సెట్ చేసే పనిలో ఉన్నారు. ఇక విషయంలోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కోలీవుడ్ లోనే కాకుండా హిందీలో కూడా రెండు సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. అలాగే ధనుష్ ఇప్పటికే ఆడుకలం సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నాడు.
ధనుష్ ప్రస్తుతం విఐపి 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే ధనుష్ ధురై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ధనుష్ తన సొంత బ్యానర్ లో ఈ మూవీని నిర్మించనున్నాడు. విద్యాబాలన్ కూడా ధర్టీ పిక్చర్ సినిమాకి నేషనల్ అవార్డు అందుకుంది. ఇలా ఇద్దిఅరు నేషనల్ అవార్డు అందుకున్న స్టార్స్ కాంబినేషన్ ని ఈ సినిమాకి సెట్ చేస్తుండడం విశేషం.