సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లో సందడి చేసిన నాచురల్ స్టార్ నాని

సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లో సందడి చేసిన నాచురల్ స్టార్ నాని

Published on Apr 21, 2024 12:00 AM IST

టాలీవుడ్ స్టార్ నటుడు నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ జెర్సీ. ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక నేటితో సక్సెస్ఫుల్ గా ఐదేళ్లు పూర్తి చేసుకున్న జెర్సీ స్పెషల్ షోలు ఏర్పాటు చేసారు. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క షోకి హైదరాబాద్ సుదర్శన్ లోని ఈవెనింగ్ నాచురల్ స్టార్ నాని తన ఫ్యామిలీ తో కలిసి సందడి చేసారు.

ఇక తమ అభిమాన హీరో థియేటర్ కి విచ్చేయడంతో పలువురు ఫ్యాన్స్ థియేటర్ లో ఈలలు, కేకలతో హోరెత్తించారు. కాగా తన ఫ్యాన్స్ మధ్యన ఐదేళ్ల తరువాత మరొక్కసారి జెర్సీ మూవీ చూడడం ఎంతో ఆనందంగా ఉందని హీరో నాని కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. మొత్తంగా జెర్సీ మూవీ ఐదేళ్ల తరువాత రీ రిలీజ్ నాని ఫ్యాన్స్ లో ఎంతో ఆనందాన్ని నింపిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు