ఇంట్రెస్టింగ్ గా నాచురల్ స్టార్ నాని కెరీర్ లైనప్

ఇంట్రెస్టింగ్ గా నాచురల్ స్టార్ నాని కెరీర్ లైనప్

Published on Feb 25, 2024 3:08 AM IST


హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. దీని అనంతరం సుజీత్ దర్శకత్వంలో డివివి సంస్థ వారే నిర్మించనున్న నాని 32వ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ నేడు వచ్చింది.

ఇక దీని తరువాత దిల్ రాజు బ్యానర్ లో బలగం దర్శకుడు వేణు తో ఒక మూవీ కూడా చేయనున్నారు నాని, ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ మూడు సినిమాలతో పాటు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో కూడా ఒక మూవీ చేయనున్నారు నాని. త్వరలో అది కూడా ఫైనలైజ్ కానుందట. మొత్తంగా నాలుగు సినిమాలతో ఇంట్రెస్టింగ్ గా హీరో నాని కెరీర్ పరంగా ముందుకు సాగనున్నారు. మరి ఈ మూవీస్ ఆయనకు ఏస్థాయి సక్సెస్ ని అందిస్తాయనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు