యంగ్ హీరో నవదీప్, సదా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘మైత్రి’. ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో పగటి పూట అందరితో సరదాగా ఉండే సదా రాత్రి పూట అందరినీ భయపెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా తనలో అనుకోని మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేదే ఈ చిత్ర కథాంశం. హను సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సూర్య రాజు దర్శకత్వం వహించారు. వికాస్ సంగీతమా అందించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శీను మరియు సత్యం రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నవదీప్ ఈ సినిమా కాకుండా ‘వసూల్ రాజా’, ‘బంగారు కోడిపెట్ట’ మరియు ‘పొగ’ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే ఎన్.టి.ఆర్ హీరోగా రానున్న ‘బాద్షా’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో చాలా కాలంగా సరైన హిట్ లేక డీలా పడిన సదాకి ఈ సినిమాతో నవదీప్ అన్నా హిట్ ఇస్తాడేమో చూడాలి.
నవంబర్ చివర్లో రానున్న నవదీప్ మైత్రి
నవంబర్ చివర్లో రానున్న నవదీప్ మైత్రి
Published on Nov 21, 2012 11:00 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ‘టాక్సిక్’కు అడ్వాన్స్ బుకింగ్స్.. ఎప్పట్నుంచి అంటే..?
- వెర్సటైల్ యాక్టర్‌కు నో చెప్పిన రామ్ పోతినేని.. కారణం అదేనా..?
- వెంకీ మామతో క్లాష్‌కు రెడీ అయిన సందీప్.. ఫలితం దక్కేనా..?
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- దూకుడుగా ‘ఫౌజీ’ షూటింగ్.. కష్టపడుతున్న మూడు యూనిట్లు..!
- మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’
- Toxic: మాల్స్ నుంచి మెట్రో రైళ్ల వరకు.. దేశవ్యాప్తంగా మొదలైన రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ ప్రమోషన్లు
- మెగాస్టార్ చిరంజీవి-బాబీ ‘#Mega158’: 40 రోజుల షూటింగ్ పూర్తి.. ఫస్ట్ హాఫ్ ఎడిట్ లాక్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్‌కు భారీ లీడ్
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్‌టైమ్ డీటెయిల్స్!
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘జన నాయగన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎందులో అంటే..??


