ఒక్క హిట్ దెబ్బకి.. వరుసగా అవకాశాలు !

ఒక్క హిట్ దెబ్బకి.. వరుసగా అవకాశాలు !

Published on Jul 7, 2019 2:30 PM IST

న‌వీన్ పొలిశెట్టి హీరోగా స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌` చిత్రం డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఈ సక్సెస్ తో న‌వీన్ పొలిశెట్టి హీరోగా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో నవీన్ పొలిశెట్టి ఓ సినిమా చేయడానికి 30 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. స్వప్న సినిమాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రం కూడా మంచి కంటెంట్ బేస్డ్ మూవీ అట. ఇక ఈ సినిమాకు ఎవరు డైరెక్షన్ చేస్తారో తెలియాల్సి ఉంది.

అలాగే న‌వీన్ పొలిశెట్టికి మరో పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో న‌వీన్ పొలిశెట్టినే హీరోగా తీసుకుబోతున్నారట. ఎలాగూ `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌` నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా ప్రొడక్షన్ లో మరో సినిమా చెయ్యడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా మరో ఇద్దరు నిర్మాతలు కూడా నవీన్ పొలిశెట్టితో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నారట. మొత్తానికి ఒక్క హిట్ దెబ్బకి.. వరుసగా అవకాశాలు వస్తున్నాయిగా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు