స్టార్స్ చేతుల మీదుగా లాంచ్ కానున్న నవీన్

స్టార్స్ చేతుల మీదుగా లాంచ్ కానున్న నవీన్

Published on Jul 29, 2014 2:50 PM IST

naveen
ఒకప్పటి కామెడీ హీరో మరియు సీనియర్ నటుడు అయిన నరేష్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం కానున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమా ఆగష్టులో లాంచ్ అవుతుందని తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఆగష్టు మొదటి వారంలో హీరో నవీన్ ని అధికారికంగా అందరికీ పరిచయం చేయనున్నారు. ఈ పరిచయ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుండి పలువు ప్రముఖులు హాజరు కానున్నారు. అలాగే ఒక స్టార్ హీరో కూడా ఈ వేడుకకి హాజరు కానున్నాడు.

ఈ సినిమా ద్వారా కృష్ణవంశీ దగ్గర పనిచేసిన రామ్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై చంటి అడ్డాల నిర్మించనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు లాంచింగ్ రోజు తెలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు