ఆ సినిమా కోసం నాన్ వెజ్ మానేసిన నయనతార.

Published on Jun 4, 2020 3:10 pm IST

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార చేస్తున్న లేటెస్ట్ మూవీ మూకుతి అమ్మన్. దర్శకుడు ఆర్ జె బాలాజీ డివోషనల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార అమ్మవారిగా మరియు భక్తురాలిగా కనిపించనున్నారని సమాచారం.నయన అమ్మవారి గెటప్ లో అధ్బుతంగా ఉన్నారు. భక్తి రస చిత్రం కావడంతో ఈ మూవీ చిత్రీకరణ సమయంలో చాలా నిష్టగా ఉన్నారట. ఈ షూటింగ్ జరిగినంత కాలం నయన తో పాటు చిత్ర యూనిట్ లో ఎవరు కూడా నాన్ వేజ్ ముట్టుకోలేదని సమాచారం.

గత నెలలోనే ఈ చిత్రం విడుదల కావాల్సివుండగా లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. థియేటర్స్ ప్రారంభం అయిన వెంటనే మూకుతి అమ్మన్ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు మరో రెండు తమిళ చిత్రాలతో నయన తార నటిస్తున్నారు. వాటిలో దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాతువాకుల రెండు కాదల్ అనే చిత్రం కూడా ఉంది.

సంబంధిత సమాచారం :

More