దర్బార్ లో నయనతార రోల్ అదే నట..!

దర్బార్ లో నయనతార రోల్ అదే నట..!

Published on Dec 29, 2019 1:33 PM IST

Nayanthara

రజిని కాంత్ దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే నెల 9న పలు భాషలలో గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేనెల 3వ తేదీన హైదరాబాద్ లో కూడా నిర్వహించనున్నారని సమాచారం. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మొదటిసారి రజిని తో ఈ చిత్రం చేస్తున్నారు. ఆయన రజిని కానీ ఓరూత్ లెస్ బాడ్ పోలీస్ అధికారిగా చూపించనున్నారని సమాచారం. ఇక మూవీ ముంబై మాఫియా నేపథ్యంలో నడుస్తుంది. దీనితో చిత్ర అధిక భాగం ముంబైలో చిత్రీకరించారు.

కాగా ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రజిని కాంత్ భార్య పాత్ర చేస్తున్న నయనతార వృత్తి రీత్యా ఆర్కిటెక్ గా కనిపిస్తారట. కథలో ఆమె పాత్ర కూడా చాల కీలకం అని తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం యంగ్ సెన్సేషన్ అనిరుధ్ అందించారు. నిన్న దర్బార్ మూవీ నుండి మూడవ సాంగ్ ‘నిఖార్సైన బ్రహ్మచారిని..’ విడుదలైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు