ఏప్రిల్ నుంచి నయనతార – శేఖర్ కమ్ముల మూవీ

ఏప్రిల్ నుంచి నయనతార – శేఖర్ కమ్ముల మూవీ

Published on Feb 14, 2013 3:56 AM IST

Nayanathara-and-Shekhar-Kam

అందాల భామ నయనతార – డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. ఇది హిందీలో సూపర్ హిట్ అయిన ‘కహానీ’ సినిమాకి రీమేక్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. హిందీ వెర్షన్లో విద్యా బాలన్ పోషించిన పాత్రని నయనతార పోషించనుంది.

ఎండేమోల్ ఇండియా బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా కథని మన నేటివిటీకి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ఈ సినిమాని ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు