అంచనాలు పెంచుతున్న నయనతార కొత్త చిత్ర ట్రైలర్ !

అంచనాలు పెంచుతున్న నయనతార కొత్త చిత్ర ట్రైలర్ !

Published on Jul 5, 2018 8:00 PM IST

kolamavu kokila

తమిళ భాషలో అగ్ర హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కొలమావు కోకిల. ఈ చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది . ఇక ట్రైలర్ చూస్తుంటే నయనతార ఈ చిత్రంలో స్మగ్లర్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. వైవిధ్యమైన కథాంశముతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అక్కట్టుకొనేలా వుంది.

నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘2. 0’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది . ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమా ఫై వున్నా అంచనాలను రెట్టింపు చేసింది.

తాజా వార్తలు