ప్రియుడితో లేడీ సూపర్ స్టార్ ఓనమ్ !

ప్రియుడితో లేడీ సూపర్ స్టార్ ఓనమ్ !

Published on Aug 31, 2020 9:22 AM IST

Nayanthara

సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో కలిసి ఈ రోజు కొచ్చిలో అడుగుపెట్టింది. నయన్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి కొచ్చిలో ఓనమ్ జరుపుకునేందుకే వారు చెన్నై నుండి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ కొచ్చి వచ్చారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతార స్టైలిష్ లుక్ లో కనిపిస్తోంది.

నయనతార విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. నిజానికి వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. అయితే తాజాగా వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పలుకుతూ త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారని.. అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయనతార స్పందించే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు