నయనతార పెళ్లి వార్తలు ఆగట్లేదుగా !

నయనతార పెళ్లి వార్తలు ఆగట్లేదుగా !

Published on Oct 21, 2019 9:00 AM IST

Nayanthara

లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో నయన్ ప్రేమలో ఉంది. వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇద్దరూ తరచు తమ రిలేషన్ ఎలివేట్ అయ్యేలా హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళుతుంటారు. అయితే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పడే సమయం ఆసన్నమైందనే వార్తలు గత కొన్ని రోజులుగా కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారని ఈ వార్తల సారాంశం.

పెళ్లికి నయన్ తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారట. అందుకే నయన్ పెళ్లికి రెడీ అవుతోందని, వచ్చే ఏడాది మార్చిలో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయన్ లేదా విఘ్నేష్ ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే. ఇక నయనతార మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా’లో సిద్దమ్మ పాత్రలో కనిపించి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది.

తాజా వార్తలు