ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న పలు అవైటెడ్ భారీ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “టాక్సిక్” కూడా ఒకటి. సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ప్రెజెంట్ చేస్తుండగా ఈ సినిమాలో సాలిడ్ తారాగణం కూడా ఉన్నారు.
కియారా అద్వానీ, హుమా ఖురేషి లాంటి బాలీవుడ్ బ్యూటీలు నటిస్తుండగా వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా ఇటీవల వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ సినిమా నయనతారని ఒక స్టన్నింగ్ లుక్ లో ప్రెజెంట్ చేస్తూ ఆమె గంగ అనే పాత్రలో నటిస్తున్నట్టుగా రివీల్ చేశారు.
దీనితో ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ,మార్చ్ 19న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
