నయన్ హిట్టు సినిమా తెలుగులోకి డబ్ అవుతుంది !

లేడీ సూపర్ స్టార్ నయన తార నటించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నొడిగళ్’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కోలీవుడ్ లో 35కోట్లు వసూళ్లను రాబట్టింది. అథర్వ , రాశి ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించారు.

ఇక తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో కి డబ్ చేస్తున్నారు. ‘అంజలి విక్రమాదిత్య’ అనే టైటిల్ తో సిహెచ్ రాంబాబు మరియు గోపినాథ్ ఆచంట ఈచిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

Advertising
Advertising