సైలెంట్ గా క్రేజీ సీక్వెన్స్ లో “బాలయ్య 109”.!

సైలెంట్ గా క్రేజీ సీక్వెన్స్ లో “బాలయ్య 109”.!

Published on Feb 16, 2024 10:00 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక సెన్సేషనల్ హ్యాట్రిక్ అందుకున్న తర్వాత తన కెరీర్ లో 109వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా అయితే తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా విషయంలో అప్డేట్స్ సమయంగుణంగా మాత్రమే వస్తున్నాయి. కానీ ఇచ్చినా అప్డేట్ కూడా ఓ రేంజ్ లో హైప్ ఇస్తుంది. అయినా బాలయ్య ఫ్యాన్స్ మరింత కోరుకుంటున్నారు.

కానీ చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్ గా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటుంది. ప్రస్తుతం మేకర్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. బాలయ్యపై ఓ అదిరిపోయే క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారట. దీనితో బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్న రెగ్యులర్ అప్డేట్స్ లేకపోయినా సినిమా మాత్రం వారి అంచనాలు అందుకునే విధంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు