ఫస్ట్ డే ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేసిన బాలయ్య !

ఫస్ట్ డే ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేసిన బాలయ్య !

Published on Mar 4, 2020 1:36 AM IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైన సంగతి తెలిసిందే. కాగా ఫస్ట్ డే నాడు ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ ను ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో షూట్ చేశారు. సినిమాలో బాలయ్య రెండో గెటప్ ఇంటర్వెల్ లోనే రివీల్ అవుతుందట. ఆ సీన్స్ నే నిన్న షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది టీం. అలాగే శ్రియా సరన్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలనుకుంటున్నారట.

మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు