వైరల్ అవుతోన్న ‘బాలయ్య’ కొత్త పోస్టర్స్ !

వైరల్ అవుతోన్న ‘బాలయ్య’ కొత్త పోస్టర్స్ !

Published on Sep 1, 2019 11:36 AM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ చిత్రం రెండు వారాలు పాటు థాయిలాండ్ లో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో సాంగ్స్ తో పాటు, బాలయ్య – హీరోయిన్స్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమాకి సంబంధించి కొత్త పోస్టర్స్ ను విడుదల చేసింది. పోస్టర్స్ లో బాలయ్య చాల స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. బాలయ్య కొత్త లుక్ తో పాటు చాల యంగ్ గా కనిపించడంతో.. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో బాగానే ఆసక్తి పెరుగుతుంది.

ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు