యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తోన్న ‘బాలయ్య’ !

Published on Sep 10, 2019 3:00 am IST

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ లో ఫుల్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ప్లాష్ బ్యాక్ లో ఈ సన్నివేశాలు వస్తాయట. బాలయ్య ఓ హోమం జరుపుతుండగా విలన్స్ అటాక్ చేస్తారు. ఈ క్రమంలోనే ఓ భారీ ఫైట్ వస్తోంది.

ఇటీవ‌ల విడుద‌లైన బాలయ్య ఫస్ట్ లుక్‌ కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మరి రెండో లుక్ కి ఇక ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో చూడాలి. మొత్తానికి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More