‘బాలయ్య’ రేపటి నుండి రామోజీ ఫిలింసిటీలో !

‘బాలయ్య’ రేపటి నుండి రామోజీ ఫిలింసిటీలో !

Published on Sep 4, 2019 5:25 PM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ రేపటి నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మ‌వ్వనుంది. ఇక ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఇటీవ‌ల విడుద‌లైన ఓ లుక్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

కాగా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ చిత్రబృందం విడుదల చేసిన రెండు పోస్ట‌ర్స్‌ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు