బాలయ్య నెక్స్ట్ మూవీ డిజిటల్ పార్ట్ నర్ ఫిక్స్!

బాలయ్య నెక్స్ట్ మూవీ డిజిటల్ పార్ట్ నర్ ఫిక్స్!

Published on Jan 15, 2024 10:06 PM IST

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటున్నారు. భగవంత్ కేసరి చిత్రం తో సూపర్ హిట్ సాధించిన ఈ హీరో, ఇప్పుడు డైరెక్టర్ బాబీ తో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ను NBK 109 టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ను ఖరారు చేయవలసి ఉంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు భాషతో పాటుగా, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు