టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ వార్ మూవీగా ఈ చిత్రం రానుంది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్ 3, 2026న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ అప్డేట్తో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. తమ అభిమాన హీరో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 111వ చిత్రం ‘NBK111’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామాను తొలుత దసరా నాటికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
అయితే, ఇప్పుడు ‘ఫౌజీ’ డిసెంబర్ 3ను లాక్ చేసుకోవడంతో బాలయ్య అండ్ టీమ్ డైలమాలో పడ్డారు. డిసెంబర్ 4న తమ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించిన టీమ్ ఇప్పుడు వేరొక డేట్ కోసం వెతుకున్నారు. మరి డిసెంబర్లో NBK111 ఏ డేట్ను ఫిక్స్ చేస్తారా.. తమ సినిమాను డిసెంబర్లోనే తీసుకొస్తారా లేక వేరే రిలీజ్ డేట్ వైపు మొగ్గు చూపుతారా..? అనేది వేచి చూడాలి.
