‘నీ కోసం’ ఆకట్టుకునేలా ఉంది ?

‘నీ కోసం’ ఆకట్టుకునేలా ఉంది ?

Published on Sep 2, 2019 12:35 PM IST

ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా అరడజనుకు పైగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ అండ్ సెన్సుబుల్ కంటెంట్ లవ్ స్టోరీతో వస్తోన్న ‘నీ కోసం’ అనే సినిమా మాత్రం ఈ శుక్రవారం ఆడియన్స్ ను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అవినాష్ కోకటి దర్శకత్వంలో అరవింద్ రెడ్డి, శుభంగి పంత్, అజిత్ రాధారామ్ – దీక్షితా పార్వతి హీరోహీరోయిన్లుగా సెప్టెంబర్ 6న రానున్న ఈ వైవిధ్యమైన ప్రేమ కథా చిత్ర్రంలో బలమైన్ ఎమోషన్స్ తో పాటు, డిఫరెంట్ స్క్రీన్ ప్లే మరియు సిస్టర్ సెంటిమెంట్ అండ్ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ సినిమాలో బాగా హైలెట్ గా నిలుస్తాయట.

ఈ మధ్య కాలంలో ఫ్యూర్ లవ్ స్టోరీ వచ్చి చాల కాలం అయింది. మరి రీ ఫ్రెషింగ్ ఎలిమెంట్స్ తో ఫ్యూర్ లవ్ స్టోరీ గా వస్తోన్న ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు అవినాష్ కోకటి మంచి ఎమోషనల్ డ్రైవ్ తో సినిమాని బాగా మలిచాడట. కాగా భారతి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు సోమశేఖర రెడ్డి, అల్లూరి రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు