కొత్తవాళ్లతో చేసిన గొప్ప సినిమా ‘నీ కోసం’ – బెక్కం వేణుగోపాల్

కొత్తవాళ్లతో చేసిన గొప్ప సినిమా ‘నీ కోసం’ – బెక్కం వేణుగోపాల్

Published on Aug 13, 2019 2:00 AM IST

వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రం ‘నీకోసం’.అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 23న విడుదల కాబోతోన్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. కాన్సెప్ట్ బేస్డ్ గా కనిపిస్తూనే కథ, కథనం పరంగా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నేను చూశాను. నాకు బాగా నచ్చింది. దర్శకుడు అవినాష్ ఈ కథను బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమాతో మరో ప్రతిభావంతమైన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడని చెప్పగలను. అందరూ కొత్తవాళ్లతో చేసిన గొప్ప సినిమా ఇది. సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ హైలెట్ గా ఉంటాయి. ఊహించని మలుపులతో.. మంచి బడ్జెట్ లో తీసిన ఈ సినిమా క్వాలిటీ పరంగానూ బాగా ఉంటుంది. ఆర్టిస్టులందరూ బాగా చేశారు. మంచి ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్టులు. ఇలాంటి మంచి సినిమాను అందరూ ఆదరించాలని కోరుతూ నీకోసం మూవీ టీమ్ కు ఆల్ ద బెస్ట్’ అని అన్నారు.

సంగీత దర్శకుడు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ.. ‘నీకోసం స్టోరీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యే కథ. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. ఆర్టిస్టులంతా మంచి నటన చూపించారు. రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడే సినిమా మంచి విజయం సాధిస్తుందనుకున్నాను.. మీ అందరి బ్లెస్సింగ్స్ మా సినిమాకు కావాలి’ అన్నారు. దర్శకుడు అవినాష్ కోకటి మాట్లాడుతూ … ‘ఇప్పటి వరకూ సినిమా చూసిన పెద్దలందరూ చాలా బావుందని మెచ్చుకున్నారు. సిన్సియర్ గా మంచి సినిమాను తీశాం. విడుదల తర్వాత ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు కానీ.. చూసిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని మాత్రం చెప్పగలను. ఒక మంచి సినిమా చూశాం అన్న ఫీలింగ్ మాత్రం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. మీరు మర్చిపోయిన.. లేదా వదిలేసిన రిలేషన్స్ అన్నీ మీకు మళ్లీ గుర్తొస్తాయి. ఇది కేవలం యూత్ కోసం మాత్రమే కాదు.. ఒక ఎమోషనల్ డ్రైవ్ లాంటి సినిమా.. ’ అని అన్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు