ఈ డిజిటల్ థియేటర్లో రిలీజ్ కాబోతున్న “నీ వెంటే నేను”

nee venta

టాలీవుడ్ సినిమా దగ్గర ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు పరిచయం అవుతూనే ఉంటారు మరి అలా లేటెస్ట్ గా నిజ జీవితంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ అయినటువంటి బాలు, స్నేహ అనే ఇద్దరు హీరో హీరోయిన్స్ గా శ్రీవెంకట సుబ్బలక్ష్మి మూవీస్ పతాకంపై అన్వర్ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి తెరకెక్కిస్తున్న సినిమానే “నీ వెంట నేను”. అయితే ఓ క్లీన్ లవబుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం “సినీబజార్” అనే డిజిటల్ థియేటర్ లో రిలీజ్ చేస్తుండడం విశేషం.

ఈ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 177 దేశాల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత వెంకట్రావు, హీరో బాలు, హీరోయిన్ స్నేహ, సినీ బజార్ అధినేత రత్నపురి వెంకటేష్ భాస్కర్ పాల్గొన్నారు. నిత్యా నాయుడు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సినీబజార్ సి.ఇ.ఓ రత్నపురి వెంకటేష్ భాస్కర్ మాట్లాడుతూ… “నీ వెంటే నేను” చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం చాలా ఆనందంగా ఉంది. పైరసీకి ఎట్టి పరిస్థితుల్లో తావులేని విధంగా సినీ బజార్ ను తీర్చిదిద్ధాం” అన్నారు. “నీ వెంటే నేను” వంటి క్లీన్ ఎంటర్టైనర్ తో పరిచయం అవుతుండటం పట్ల హీరో బాలు, హీరోయిన్ స్నేహ సంతోషం వ్యక్తం చేశారు.

Exit mobile version