గ్రాండ్ గా ‘నీది నాది ఒకే కథ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ !

21st, March 2018 - 01:00:50 PM

వేణు ఉడుగుల దర్శకత్వంలో శ్రీ విష్ణు దర్శకత్వం వహించిన సినిమా ‘నీది నాది ఒకే కథ’. సురేష్ బొబ్బిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నాగేశ్వర రెడ్డి బొంతల ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. ట్రైలర్ విడుదల తరువాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. యూత్ ఫుల్ సబ్జెక్టు తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా.

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు క్లీన్ యు సట్టిఫికేట్ లభించడం జరిగింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా యూనిట్ ను మెచ్చుకోవడం జరిగింది. ‘మెంటల్ మదిలో’ సినిమా తరువాత శ్రీ విష్ణు నటించిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్న టైటస్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడిగా నటించింది. ఈ రోజు సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ పలువురు హీరోలు, దర్శకుల మద్య జరగనుంది.