త్వరలో ‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్ విడుదల !

త్వరలో ‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్ విడుదల !

Published on Mar 14, 2018 2:56 PM IST

వేణు ఉడుగుల దర్శకత్వంలో శ్రీ విష్ణు నటిస్తోన్న నీది నాది ఒకే కథ సినిమా మర్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా నాగేశ్వర రెడ్డి బొంతల ఎడిటర్ గా పని చేసారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ట్రైలర్ ను ఈ వారాంతంలో రిలీజ్ చెయ్యబోతున్నారు.

నారా రోహిత్ ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్రకు ప్రేక్షకుల నుండి గుడ్ రెస్పాన్స్ లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పోసాని కృష్ణ మురళి రోల్ సినిమాలో కీలకమని తెలుస్తోంది. ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ ఇందులో శ్రీ విష్ణు సరసన నటించింది. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు