తమిళ సినిమా దగ్గర తనదైన రా అండ్ రస్టిక్ సినిమాలు చేస్తూ ముద్ర వేసుకున్న టాలెంటెడ్ దర్శకుడు వెట్రిమారన్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మరో రకంగా వైరల్ అవుతున్నారు. లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ సినిమా ధురంధర్ 2 విషయంలో తాను పరోక్షంగా చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో వివాదానికి దారి తీశాయి. దీనితో వెట్రిమారన్ ఫిల్మోగ్రాఫీపై పలు కామెంట్స్ పడుతున్నాయి.
ప్రాపగాండా సినిమాలు తీసే తను ఇంకో సినిమాని ప్రాపగాండా అంటూ కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. అలాగే వెట్రిమారన్ కి సపోర్ట్ గా ఉన్నవారు కూడా లేకపోలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం వెట్రిమారన్ కామెంట్స్ మాత్రం అటు తమిళ్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ లో కూడా ఓ రేంజ్ హాట్ టాపిక్ గా మారిపోయాయి.


