ఈరోజు సెన్సార్ పూర్తిచేసుకోనున్న ‘నేల టికెట్టు’ !
Published on May 17, 2018 9:51 am IST


‘సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల మాస్ మహారాజ రవితేజతో కలిసి చేసిన తాజా చిత్రం ‘నేల టికెట్టు’. పాటలు, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

దీనితో చిత్ర యూనిట్ నిర్మాణాంతర కార్యక్రమాల్ని వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఈరోజు చిత్రాన్ని సెన్సార్ కార్యక్రమాలకి పంపనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రంతో మాళవిక శర్మ కథానాయకిగా తెలుగు తెరకు పరిచయం కానుంది. కళ్యాణ్ కృష్ణ గత సినిమాల్లానే ఈ చిత్రంలో కూడ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ కంటెంట్ కూడ ఎక్కువగానే ఉండనున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook