విడుదలైన ‘నేను లేను’ ఫస్ట్ లుక్ !

విడుదలైన ‘నేను లేను’ ఫస్ట్ లుక్ !

Published on Nov 9, 2018 9:43 AM IST

హ‌ర్షిత్ హీరోగా పరిచయమవుతూ నటిస్తున్న చిత్రం ‘నేను లేను’. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూడ‌ని వినూత్న‌మైన క‌థ‌నంతో తెరకెక్కింది ఈ చిత్రం . అందమైన లొకెషన్స్ లొ చిత్రీకరణ పూర్తయింది. నవంబర్12 న చిత్ర టీజ‌ర్‌ను విడుదల చేసి తర్వలోనే సినిమాను విడుదల చేస్తామన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు