సమీక్ష : నేను నా నాగార్జున – బోరింగ్ గా సాగే కామెడీ డ్రామా.

Published on Sep 21, 2019 8:55 pm IST

విడుదల తేదీ : సెప్టెంబరు 21, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  1/5

నటీనటులు : మహేష్ ఆచంట, సోమి వర్మ,తోట మధు.

దర్శకత్వం : ఆర్ బి గోపాల్

నిర్మాత‌లు : గుండపు నాగేశ్వరరావు

సంగీతం : ఈశ్వర్ పెరల్

సినిమాటోగ్రఫర్ : నాగార్జున సి హెచ్

ఎడిట‌ర్‌ : హరీష్ రావు కృష్ణ

తన నటనతో స్టేజ్ షోలపై మంచి పేరు తెచ్చుకున్న మహేష్ ఆచంట సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని హీరోగా కొత్త ప్రయాణం మొదలు పెట్టారు.తాను హీరోగా సోమి వర్మ హీరోయిన్ గా ఆర్ బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నేను నా నాగార్జున” కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :
ఇక కథలోకి వచ్చినట్టైతే హీరో మహేష్ ఆచంట(మహేష్) విశాఖపట్నంలో ఓ గ్రామంలోని ఫ్రెండ్స్ తో తిరిగే సాదా సీదా కుర్రాడు.అయితే ప్రముఖ సినీ హీరో కింగ్ నాగార్జునకు వీరాభిమాని అయినటువంటి వ్యక్తి కూతురే హీరోయిన్ అఖిలా(సోమి వర్మ).అయితే ఈమెను తొలి చూపులోనే ప్రేమించిన మహేష్ ఎలా అయినా సరే తన ప్రేమను దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తాడు.అయితే నాగార్జున వీరాభిమాని అయినటువంటి హీరోయిన్ తండ్రిని మేనేజ్ చెయ్యడానికి హీరో కుటుంబం ఎన్ని తంటాలు పడింది?ఆఖరుకు మహేష్ తన ప్రేమను గెలిపించుకున్నడా లేదా?అసలు ఈ ప్రయాణం అంతా ఎలా సాగిందో తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొదటగా సినిమా టైటిల్ చూస్తేనే ఈ సినిమాలో కింగ్ నాగార్జున రెఫరెన్స్ లు ఉంటాయని అర్ధం అయ్యింది.అలా నాగార్జున అభిమానులకు నచ్చే అంశాలు కోరుకునే వారిని ఈ చిత్రం అలరించవచ్చు.ఫస్టాఫ్ లో ఢీ10 ఫేమ్ తేజస్వి స్పెషల్ ఐటమ్ సాంగ్ బాగుంటుంది, అలాగే హీరోగా మొదటిసారిగా తెరపైకి సరికొత్త దారి ఎంచుకున్న మహేష్ ఇది వరకే ఎన్నో సినిమాల్లో నటించి మంచి నటన కనబరిచారు.

అలాగే ఈ చిత్రంలో కూడా హీరోగా కూడా మంచి నటనను కనబరిచారు.అలాగే హీరోయిన్ కూడా లుక్స్ పరంగా అందంగా కనిపించి తాను కూడా పరిణితి కలిగిన నటన కనబరిచింది.ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో నటించిన తోట మధు పాత్ర అలాగే హీరోయిన్ తండ్రి పాత్రలు సినిమా అంతా ఫన్నీగా సాగుతాయి.అలాగే సెకండాఫ్ లో వచ్చే ప్రముఖ కమెడియన్ సుమన్ శెట్టి పాత్ర సినిమా చివరిలో మంచి ఫన్నీ ట్విస్ట్ తో నవ్విస్తుంది.సంగీత దర్శకుడు ఈశ్వర్ పెరవలి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ దర్శకత్వమే అని చెప్పాలి.దర్శకుడు ఆర్ బి గోపాల్ తాను తీసుకున్నదే సింపుల్ లైన్. అయినా సరే దాన్ని పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దడంలో పూర్తిగా విఫలం అయ్యారు.అంతే కాకుండా స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా ఉండదు.అనవసరమైన కామెడీ సన్నివేశాలు అంతగా నవ్వు తెప్పించకపోగా విసుగు తెప్పిస్తాయి.
పాటల ప్లేస్ మెంట్ కూడా బాలేదు. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక సినిమాను చూస్తున్నంత భావన అయితే ప్రేక్షకుడికి కలగదు.ఈ విషయంలో దర్శకుడు ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారో ఆయనకే తెలియాలి.దానికి తోడు సెకండాఫ్ కూడా బాగా సాగదీతగా కూడా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :

దర్శకుని విషయం పక్కన పెడితే సినిమాటోగ్రఫర్ నాగార్జున సి హెచ్ కెమెరా పనితనం బాగుంది. గుండపు నాగేశ్వర్ రావు నిర్మాణ విలువలు అంతగా బాగోలేవు.సంగీతం అందించిన ఈశ్వర్ పెరల్ పాటలు మినహాయిస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.

తీర్పు :

స్టేజి షోల నుంచి సినిమా నటుడిగా ఎదిగిన మహేష్ ఆచంట హీరోగా మారి వేసిన మొదటి అడుగు దర్శకుని తప్పటడుగులు వల్ల పూర్తిగా దారి తప్పింది.అక్కడక్కడా నవ్వించే కామెడీ తప్ప మిగతా సినిమా అంతా విసుగు తెప్పించే స్క్రీన్ ప్లే,వీక్ దర్శకత్వం మూలానా బోరింగ్ గా సాగుతుంది.

123telugu.com Rating :  1/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :

X
More