నేడు సరిలేరు నీకెవ్వరూ మూవీ నుండి నేడు టైటిల్ సాంగ్ విడుదల చేశారు. సరిలేరు నీకెవ్వరు యాంథం పేరుతో విడుదలైన ఈ సాంగ్ మిగతా పాటలకు మించి రెస్పాన్స్ అందుకుంటుంది. సైనికుల గొప్పతనాన్ని త్యాగనిరతిని, కష్టాలను తెలిపేలా సాగిన సరిలేరు నీకెవ్వరు.. సాంగ్ విషయంలో దేవిశ్రీ ప్రసంశలు అందుకుంటున్నారు. కాగా ఈ పాటను దేవిశ్రీ స్వయంగా రాశారు. దేశ సైనికుల గురించి ఇంత మంచి సాహిత్యం అందించిన దేవీశ్రీని, నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా పొగిడేస్తున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రానికి దేవిశ్రీ రెండు పాటలు రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరున్న దేవి అప్పుడప్పుడూ ఇలా తన కాలానికి పదునుపెడుతుంటాడు.
ఇక మహేష్ రష్మిక మందాన జంటగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దర్శకత్వం అనిల్ రావిపూడి వహిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. దిల్ రాజు, మహేష్ మరియు రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
