సోషల్ మీడియాలో “యానిమల్” మూవీ పై ట్రోలింగ్!

సోషల్ మీడియాలో “యానిమల్” మూవీ పై ట్రోలింగ్!

Published on Jan 28, 2024 6:07 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకొని, ఇటీవల డిజిటల్ ప్రీమియర్ గా ఆడియెన్స్ ముందుకి వచ్చింది. ఈ చిత్రం ఓటిటి లో తెలుగు తో పాటుగా, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఓటిటి లోకి వచ్చిన మరుక్షణం నుండి యానిమల్ మూవీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

ఈ చిత్రం పై అటు ప్రశంసలు వస్తున్నాయి. అదే విధంగా విమర్శలు కూడా వస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సైతం యానిమల్ మూవీ పై విమర్శలు చేస్తున్నారు. అయితే హీరో రన్ బీర్ కపూర్ భారీ యాక్షన్ సన్నివేశాలను ఉద్దేశించి పలువురు ట్రోల్ చేస్తున్నారు. పోలీసులు అంతా నిద్రపోయారు అంటూ ఒక పిక్ వైరల్ అవుతోంది. యానిమల్ మూవీ ను సపోర్ట్ చేసేవారు కోలివుడ్ చిత్రం అయిన పొన్నియిన్ సెల్వన్ అందుకు బదులుగా ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు