నెటిజెన్స్ ఆ హీరోని మాములుగా ట్రోల్ చేయడంలేదు

నెటిజెన్స్ ఆ హీరోని మాములుగా ట్రోల్ చేయడంలేదు

Published on Jul 31, 2019 1:06 PM IST

హాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులలో ఒకరైన జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి “అవతార్” చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. పాండోరా అనే ఓ నూతన ప్రపంచానికి ప్రేక్షకులని తీసుకెళ్లి,అక్కడి అద్భుతాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. 2009లో విడుదలైన ఈ చిత్రానికి సిక్వెల్స్ కూడా వస్తున్నాయి.

ఐతే బాలీవుడ్ హీరో గోవిందా ఈ చిత్రంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు. తాజాగా గొంవిందా ఓ ఇంటర్వ్యూలో అవతార్ సినిమాలో నటించాల్సిందిగా దర్శకుడు జేమ్స్ కామెరూన్ తనను సంప్రదించారన్నారు. కానీ కొన్ని కారణాలతో నేను ఆ అవకాశాన్ని తిరస్కరించాను అని అన్నారు. అలాగే కామెరూన్ కి “అవతార్” అనే టైటిల్ పెట్టమని సలహా ఇచ్చింది నేనేనని అన్నారు. గతంలో తాళ్, గద్దర్, దేవదాస్ వంటి హిట్ చిత్రాలలో నటించే అవకాశం వదులుకున్నాను అన్నారు.

దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ హీరోపై మీమ్స్,స్పూఫ్స్ తో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్స్. గత రెండు రోజులుగా నెటిజెన్స్ ఎవరికి వచ్చిన రీతిలో వారి క్రెయేటివిటీ ఉపయోగించి ఈ హీరోతో ఆడుకుంటున్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు వాస్తవంగా జరగడం వలన చేశారో, లేక హాస్యం కొరకు అలా అన్నారో తెలియదు కానీ,నెటిజన్స్ కి దొరికిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు