నాని సినిమా ఆలస్యానికి కారణం అందులోని నటులేనట !

nani-nenu-local
‘మజ్ను’ చిత్రం తరువాత హీరో నానై చేస్తున్న చిత్రం ‘నేను లోకల్’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ నెలాఖరులో విడుదలవాల్సి ఉండగా ఆలస్యమవుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో సినిమాపై భారీ అసలు పెట్టుకున్న నాని అభిమానులు కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. అసలు సినిమా డిసెంబర్ ఆఖరుకు వస్తుందా లేదా. ఒకవేళ రాకుంటే కారణం ఏమిటి అని తజన భర్జన పడుతున్నాడు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే నెలకు వాయిదాపడే అవకాశముందని తెలుస్తోంది.

అందుకు కారణం సినిమాలోని నటీ నటులేనట. కథలోని కొన్ని కీలక పాత్రలు పోషిస్తున్న నటీ నటులు వేరే ప్రాజెక్టుల్లో ఉండటం వలన ‘నేను లోకల్’ సినిమాకి సరిగ్గా డేట్లు ఇవ్వలేకపోతున్నారట. ఎంత ప్రయత్నించినా పూర్తి స్థాయిలో డేట్లు కుదర్చలేకపోతున్నారట. అందుకే షూటింగ్ ఆలస్యమై సినిమా వాయిదాపడే అవకాముందని అంటున్నారు. ఇకపోతే దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నానికి జోడీగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది.

Exit mobile version