బజ్..చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యంగా.?


ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం మరో ఇండియన్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఓ సాలిడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చెయ్యనున్నాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

అలా రీసెంట్ గా శంకర్ పలువురు స్టార్స్ ను ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాలో నటించేలా చేస్తున్నారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో టాక్ వినిపిస్తుంది. ఇంతకు ముందు ఈ సినిమా అన్నీ సెట్ అయితే ఈ ఏడాది జూన్ నుంచే షూట్ మొదలు పెట్టుకోనుంది అని బజ్ బయటికి వచ్చింది.

కానీ ఇప్పుడు నయా రూమర్ ఏమిటంటే దీనికి ముందు చేస్తున్న “ఇండియన్ 2” మిగిలి ఉన్న షూట్ కంప్లీట్ చెయ్యాల్సింది కొంతమేర ఉందట దానిని కంప్లీట్ చేసేసరికి కాస్త టైం కూడా పడుతుందని తెలుస్తుంది. దీనితో చరణ్ తో ప్రాజెక్ట్ అనుకున్న సమయాని కన్నా కాస్త లేట్ అవ్వొచ్చేమో అని తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version